పండ్లతో ఆరోగ్యం


పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎందుకంటారా? వీటి వల్ల శరీరానికి ఎన్నో లాభాలున్నాయి. పండ్లు, కూరగాయలు తింటే ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాదు కొన్ని క్రానిక్‌ జబ్బుల మీద ఇవి టానిక్‌లా పనిచేస్తాయి. అవేమిటో తెలుసుకుందామా…
పండ్లలో సహజంగానే ఫ్యాట్‌, సోడియం, కాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కొలసా్ట్రల్‌ ఉండదు.

ఎన్నో అతిముఖ్యమైన న్యూట్రియంట్లు పండ్లలో ఉంటాయి. ఉదాహరణకు పొటాషియం, డైటరీ ఫైబర్‌, విటమిన్‌- సి, ఫోలిక్‌ యాసిడ్లు పండ్లలో ఎక్కువగా ఉంటాయి.

పొటాషియం ఎక్కువగా ఉన్న పండ్లు, ఆహారపదార్థాలు తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అరటిపండు, ఆప్రికాట్స్‌, కమలాపండ్లలాంటి వాటిల్లో పోటాషియం పుష్కలంగా ఉంటుంది.

పండ్లలోని పీచుపదార్థాల వల్ల శరీరంలో బ్లడ్‌ కొలసా్ట్రల్‌ ప్రమాణాలు తక్కువగా ఉంటాయి. కొలసా్ట్రల్‌ తక్కువ ఉండడం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశం తక్కువ. జీర్ణక్రియ సరిగా ఉండాలంటే మనం తినేవాటిలో పీచుపదార్థాలు పుష్కలంగా ఉండాలి. పీచు బాగా ఉన్న పండ్లు తినడం వల్ల మలబద్ధకం, జీర్ణవ్యవస్థకు సంబంధించిన జబ్బులు రావు.

విటమిన్‌-సి శరీరంలోని టిష్యూలను ఆరోగ్యంగా ఉంచుతుంది. గాయాలు తొందరగా మానేలా సహాయపడుతుంది. అంతేకాదు దంతాలను, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఫోలిక్‌ యాసిడ్‌ వల్ల ఎర్రరక్తకణాలు శరీరంలో వృద్ధి చెందుతాయి. గర్భిణీలు ఫోలిక్‌ యాసిడ్‌ ఉన్న ఆహారపదార్థాలను ఎక్కువ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. గర్భంలోని శిశువు ఎలాంటి జబ్బులు సోకకుండా ఆరోగ్యంగా పెరుగుతుంది.

పండ్లు, కూరగాయలు బాగా తినడం వల్ల గుండెజబ్బులు, సో్ట్రక్‌వంటివి వచ్చే అవకాశం తక్కువ. అంతేకాదు కూరగాయలు బాగా తినడం వల్ల కొన్ని రకాలైన క్యాన్సర్లు రావు.

పండ్లు, కూరగాయలు బాగా తినడం వల్ల ఊబకాయం బారినపడరు. టైప్‌-2 డయాబెటిస్‌ రాదు. గుండెజబ్బులు వచ్చే అవకాశం లేదు.