గ్రీన్ టీ మంచిదే… కానీ?!


కొలెస్ట్రాల్ కరిగించడానికి, బరువు తగ్గించడానికి గ్రీన్ టీ చాలా ఉపయోగపడుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే రోజుకు రెండు కప్పులకు మించి గ్రీన్ టీని కడుపులో వేస్తే, అది చాలా సమస్యల్ని మీ గడపలోకి తీసుకొస్తుందంటున్నారు పరిశోధకులు. వాళ్లు చెబుతున్నదాని ప్రకారం…

గ్రీన్ టీలోనూ కొద్దిగా కెఫీన్ ఉంటుంది. ఉండదనుకుని రోజుకు నాలుగైదు కప్పులు లాగిస్తే, శరీరంలోకి కెఫీన్ ఎక్కువగానే చేరిపోతుంది  గర్భవతులు రెండు కప్పుల కంటే ఎక్కువ గ్రీన్ టీ తాగితే… గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందట  గ్రీన్ టీలోని పాలీఫినాల్స్ మోతాదు మించి శరీరంలో చేరినట్లయితే, క్యాన్సర్‌ని నిరోధించే కణాలను అడ్డుకుంటాయని తేలింది  ఖాళీ కడుపుతో గ్రీన్ టీ ఎక్కువ తాగితే గ్యాస్ట్రిక్, లివర్‌కి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి  గ్రీన్ టీలో ఉంటే ట్యానిన్స్… ఆహారం, పానీయాల ద్వారా శరీరంలోకి ప్రవేశించే ఇనుమును అడ్డుకుంటాయి  .చూశారుగా! ఒక్కోసారి మనం మంచనుకున్నది మన పాలిట చెడవుతుంది. కాబట్టి దేని విషయంలోనైనా అతి ప్రమాదమే!