బ్రకోలితో చెడు కొలెసా్ట్రల్‌కు చెక్‌

కొత్త రకం బ్రకోలిని డైట్‌లో చేర్చుకోవడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. చెడు కొలెసా్ట్రల్‌ 6 శాతం మేర తగ్గుతుంది. ఈ విషయం ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడయింది. సహజ సిద్ధంగా లభించే మిశ్రమం ‘గ్లూకోరఫనిన్‌’ సాధారణ బ్రకోలి రకంతో పోల్చితే కొత్త రకం బ్రకోలిలో రెండు, మూడు రెట్లు ఎక్కువగా లభిస్తుంది. ఈ రకం ఇప్పటికే ‘బెనెఫోర్ట్‌’ పేరుతో బ్రిటిష్‌ సూపర్‌మార్కెట్లలో లభిస్తోంది. ‘‘గ్లూకోరఫనిన్‌ అధికంగా తీసుకున్న మనుషులపై జరిపిన రెండు వేరు వేరు పరిశోధనల్లో ప్లాస్మా ఎల్‌డీఎల్‌-సి (లో డెన్సిటీ లైపోప్రోటీన్‌ కొలెసా్ట్రల్‌) గణనీయంగా తగ్గింది’’ అని పరిశోధనకు నేతృత్వం వహించిన చార్‌లొట్టే ఆర్మా అన్నారు. ఈయన నౌరిచ్‌లోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ రీసెర్చ్‌లో పరిశోధనలు సాగిస్తున్నారు. అధ్యయనంలో భాగంగా 130 వాలంటీర్లపై పరిశోధనలు నిర్వహించారు. ప్రతిరోజు వారి డైట్‌లో 400గ్రాముల గ్లూకోరఫనిన్‌ బ్రకోలి ఇచ్చారు. 12 వారాల తరువాత పరీక్షిస్తే వారి రక్తంలో ఎల్‌డీఎల్‌ కొలెసా్ట్రల్‌ 6శాతం మేర తగ్గింది. ఎల్‌డీఎల్‌ కొలెసా్ట్రల్‌ గుండె జబ్బులకు కారణమవుతుందన్న సంగతి తెలిసిందే. సంప్రదాయ బ్రీడింగ్‌ పద్ధతుల్లో ఈ బ్రకోలి అభివృద్ధిపరిచారు.