యాంటీ హెర్పిస్‌ మందుతో హెచ్‌ఐవీ నియంత్రణ

హెర్పిస్‌ వ్యాధి నివారణకు వాడే వాలసిక్లోవిర్‌ (వాలె్ట్రక్స్‌) హెచ్‌ఐవీ చికిత్సలోనూ ఉపయోగపడుతోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. శరీరంలోకి చేరిన హెచ్‌ఐవీ కొంతకాలం తర్వాత ఎయిడ్స్‌గా రూపాంతరం చెందుతుందనే విషయం తెలిసిందే! అయితే, యాంటీ హెర్పి్‌సగా ఉపయోగించే వాలె్ట్రక్స్‌ ఈ వైరస్‌ పునరుత్పత్తిని అదుపుచేయడం ద్వారా హెచ్‌ఐవీని నియంత్రిస్తోందని యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు వివరించారు. ఈమేరకు రెండు గ్రూపులుగా విభజించిన 18 మంది వలంటీర్లపై ప్రయోగం చేసి దీనిని నిర్ధారించుకున్నట్లు వర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ బెనింగో రోడ్రిగ్వెజ్‌ వివరించారు. ఈ పరిశోధనలో భాగంగా.. ఓ బృందానికి రోజుకు రెండు పూటలా వాలె్ట్రక్స్‌ను, మరో గ్రూపునకు ప్లాసిబో (ఉత్తుత్తి మాత్రల)ను ఇచ్చామని చెప్పారు. పన్నెండు వారాల పాటూ సాగిన ఈ పరిశోధనలో వాలె్ట్రక్స్‌ మందును తీసుకున్న బృందంలో హెచ్‌ఐవీ క్రిముల సంఖ్య నియంత్రణలో ఉందని ఆయన వివరించారు.