షారూక్ ఖాన్ ఇరుకున్నాడు

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ లీగల్ చిక్కుల్లో పడ్డాడు. షారుఖ్ చుట్టూ ఈడీ నోటీసుల ఉచ్చు బిగుస్తోంది. షారుఖ్ కు చెందిన ‘నైట్ రైడర్స్’ ఫ్రాంఛైజీకి సంబంధించిన వాటాల అమ్మకంలో విదేశీ మారక ద్రవ్యం నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనల్ని ఉల్లంఘించినట్లు కేంద్ర ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గుర్తించింది. ఈ మేరకు షారుక్ కు నోటీసులు జారీ చేసింది ఈడీ. దీనికి సంబంధించి షారుఖ్ కి సమన్లు జారీ చేయడం ఇది రెండో సారి. ఈ ఏడాది మేలో కూడా ఇదే విషయమై షారుఖ్ కు నోటీసులు పంపింది ఈడీ. అయితే ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో, తాజాగా మరోసారి సమన్లు జారీ చేసిన ఈడీ.. దీనిపై వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశాలు ఇచ్చింది.