రీషూట్ చెయ్యడం లేదు

అఖిల్ సినిమా వాయిదా ప‌డ‌డంతో, ఆ సినిమాపై బోల్డ‌న్ని పుకార్లు పుట్టుకొచ్చేశాయ్‌. ఈ సినిమా నాగార్జున‌కు న‌చ్చ‌లేద‌ని, అందుకే రీషూట్ చేయిస్తున్నార‌ని, దాంతో ఈ సినిమా వాయిదా ప‌డింద‌ని చెప్పుకొన్నారు. రీషూట్ కోసం దాదాపు రూ.5 కోట్ల వ‌ర‌కూ ఖ‌ర్చువుతుంద‌ని లెక్కలు గ‌ట్టారు. అయితే అఖిల్ ఈ విష‌యాల్ని ఖండించాడు. రీషూటేం లేదు… అవ‌న్నీ ఊహాగానాలే అని కొట్టిప‌రేశాడు. అయితే… అఖిల్ సినిమా ఎప్పుడు విడుద‌ల చేస్తార‌న్న విష‌యంపై అటు అఖిల్ కూడా క్లారిటీ ఇవ్వ‌డం లేదు. దాంతో.. ఈ సస్పెన్స్ కొన‌సాగుతోంది. రీషూట్‌లాంటివి లేవ‌ని ట్విట్ట‌ర్‌లో ప్ర‌క‌టించిన అఖిల్‌… రిలీజ్ డేట్ కూడా చెప్పేస్తే పోయేదిగా.