ఓం కార్ ” రాజు గారి గది” సూపర్ హిట్

బుల్లితెరపై ఎన్నో సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్ చేసి సక్సెస్ చూసిన ఓంకార్ కి వెండితెరపై డైరెక్టర్ గా చేసిన మొదటి సినిమా జీనియస్ మాత్రం చేదు అనుభవాన్నే మిగిల్చింది. కానీ ఓంకార్ రెండవ ప్రయత్నంగా చేసిన ‘రాజుగది గది’ సినిమా మాత్రం చాలా పెద్ద విజయాన్నే తెచ్చి పెట్టింది. చాలా చిన్న బడ్జెట్ తో యంగ్ నటీనటులతో చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద పెద్ద విజయంగా నమోదైంది.రిలీజ్ కి ముందే ఈ సినిమాని లాభాలకి అమ్మేశాడు ఓంకార్. ఈ సినిమాని కొనుక్కొని రిలీజ్ చేసిన వారాహి చలన చిత్రం అమరియు ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారికి కూడా మంచి లాభాలు వస్తున్నాయి. సినిమాకి కూడా ఫుల్ పాజిటివ్ రిపోర్ట్స్ రావడం మరియు కామెడీ బాగా వర్కౌట్ అవ్వడంతో బాక్స్ ఆఫీసు అవ్డ్డ కూడా ఈ సినిమాకి కాసుల వర్షం కురుస్తోంది. రిలీజ్ అయిన రెండవ రోజు నుంచే ఈ సినిమాకి స్క్రీన్స్ పెరుగుతూనే ఉన్నాయి. అలాగే ఈ సినిమాకి ఇప్పటికే ఖర్చుచేసిన దానికి రెండింతలు లాభాలు వచ్చాయని సమాచారం. దీంతో ఓంకార్ కి మంచి అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే రాజుగారి గది కొనుక్కున్న ఏకే ఎంటర్ టైన్మెంట్స్ వారు ఓంకార్ తో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.