పరిణీత తో ఎన్టీఆర్ ?

ఎన్టీఆర్ – కొర‌టాల శివ కలయికలో ఓ సినిమా తెరకెక్కనుంది. సినిమా ఇటివలే లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. త్వరలోనే చిత్రీకరణ మొదలుపెడతారు. ప్రస్తుతం చిత్రబృందం హీరోయిన్ కోసం అన్వేషిస్తోంది. బాలీవుడ్ ముద్దుగుమ్మ పరిణీతి చోప్రాకు వద్దకు ఈ ఆఫర్ వెళ్ళిందని తెలిసింది. ప్రస్తుతం చిత్రబృందం పరిణీతితో సంప్రదింపులు జరుపుతోందని టాక్. ఇదివరకు కొంతమంది తెలుగు దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదించారు. కానీ కాల్షీట్లు సర్దుబాటు చేయలేక ఆ అవకాశాల్ని వదులుకొంది పరిణీతి. ఎన్టీఆర్ సినిమా గనక ఓకే అయితే.. ఇదే పరిణీతి తొలి తెలుగు చిత్రం అవుతుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది.