నయనతార కి పొగడ్తల వర్షం

నయనతారను హీరో సిద్ధార్థ్ అదేపనిగా పొగిడేస్తున్నాడట. తాజాగా విడుదలైన ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమాలో ఆమె నటన అద్భుతం .. అమోఘం అంటూ ప్రశంసించడమే కాకుండా, ట్వీట్లు కూడా పెడుతున్నాడు. నయనతార నటించిన ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమా ఇటీవల విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో ‘కాదంబరి’గా నటించిన నయనతార, ఈ సినిమా విజయంలో ప్రధానమైన పాత్రని పోషించిందనే టాక్ వినిపించింది. విమర్శకులు కూడా ఆమె నటనని ప్రశంసించారు. మరి అలాంటప్పుడు సిద్ధార్థ్ అభినందించడం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడమెందుకు? అనే సందేహం రావచ్చు. అయితే నయనతార సినిమాతో పాటుగా, సమంతా నటించిన ‘పత్తు ఎండ్రాదుకుళ్ల’ సినిమా కూడా రిలీజ్ అయింది. ఈ సినిమా అక్కడ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. సమంతాతో మనస్పర్థలు తలెత్తడం వలన దూరమైన సిద్ధార్థ్, ఆమెని ఉడికించడం కోసమే నయనతారని తెగ పొగిడేసేస్తున్నాడనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది.