నాగార్జున తో బ్రూస్ లీ మంతనాలు

బ్రూస్లీ సినిమా ఫ‌ట్ మంది. ఇక రామ్ చ‌ర‌ణ్ దృష్టంతా… త‌ని ఒరువ‌న్ రీమేక్‌పైనే. ఈ సినిమా ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. అయితే విల‌న్ పాత్ర ఎవ‌రితో చేయించాల‌న్న విష‌యంపై ఇప్ప‌టి వ‌ర‌కూ ఓ స్ప‌ష్ట‌త రాలేదు. రానా, మాధ‌వ‌న్, అర‌వింద్ స్వామి, నారా రోహిత్‌.. ఇలా చాలామంది పేర్లు ప‌రిశీల‌న‌కు వ‌చ్చాయి. చివ‌రికి నాగార్జున వ‌ర‌కూ వెళ్లింది. నాగ్ అయితే ఈ పాత్ర‌కు ఓ హుందాత‌నం వ‌స్తుంద‌ని చ‌ర‌ణ్ భావిస్తున్నాడు. ముందు నాగ్‌ని అనుకొన్నా.. ఇలాంటి పాత్ర‌ల‌కు ఒప్పుకోడేమో అని మిగిలిన ఆప్ష‌న్స్ ప‌రిశీలించారు. వాళ్లంతా `నో` చెప్ప‌డంతో ఇప్పుడు మ‌ళ్లీ నాగ్ ద‌గ్గర‌కే వెళ్లింద‌ని తెలుస్తోంది. నాగ్‌ని ఒప్పించ‌డానికి చ‌ర‌ణ్ రంగంలోకి దిగాడ‌ని తెలుస్తోంది. నాగ్ తో ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ సంప్ర‌దింపులు జ‌రుపుతున్నాడ‌ని నాగ్ ఓకే అంటే డిసెంబ‌రులో ఈ సినిమాని ప‌ట్టాలెక్కించ‌డానికి రెడీ అవుతున్నాడ‌ని టాక్‌.