మహా ప్రస్థానంతో వస్తా అంటున్నాడు

వెన్నెల, ప్రస్థానం లాంటి విభిన్న తరహా సినిమాలతో ఆకట్టుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ దేవకట్టా.. అ తర్వాత ఆయన చేసిన ఆటోనగర్ సూర్య, డైనమైట్ సినిమాలు ఆశించిన స్థాయి ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో కూసింత గ్యాప్ తీసుకున్న దేవకట్టా ప్రస్తుతం తన తదుపరి సినిమా కథ రాసుకునే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకి ‘మహా ప్రస్థానం’ అనే వర్కింగ్ టైటిల్ ని కూడా పెట్టుకున్నాడు. ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనేదాని మీద ఓ చిన్న టీజర్ బీఇత్ ని కూడా రిలీజ్ చేసాడు.ఆ టీజర్ ని చూస్తె ఈ సినిమాలో ఫేమస్ హాలీవుడ్ ఫిల్మ్ గాడ్ ఫాదర్ ఛాయలు కనపడుతున్నాయి. ఆ విషయాన్ని కాసేపు పక్కన పెడితే 7 ఏళ్ళ వయసు నుంచి డబ్బు అనేసాని కోసం ఏం చెయ్యడానికైనా సిద్దపడిన ఓ కుర్రాడు పెరిగి పెద్దయ్యి ఈ ప్రజలనే శాశించే స్థాయికి ఎదిగాడు. అతనే జెడిఆర్ అని చూపించాడు. నన్ను ద్వేశించండి, నేను లంచగొండిని, నేను క్ర్మినల్ ని ఫైనల్ గా నేనే ఈ మహా ప్రస్థానానికి విలన్ అని ఈ టీజర్ వాయిస్ ఓవర్ లో దేవకట్టా చెప్పాడు. కానీ ఆ జెడిఆర్ ఎవరనేది మాత్రం చెప్పలేదు ఎందుకంటే తనే ఇంకా నటీనటుల్ని ఫైనలైజ్ చేయలేదు. ప్రస్తుతం స్క్రిప్ట్ ని పూర్తి చేసే పనిలో ఉన్న దేవకట్టా త్వరలోనే ఈ కథకి సరిపొయీ నటీనటుల్ని ఎంచుకోనున్నాడు. త్వరలోనే పూర్తి వివరాలు అనౌన్స్ చేస్తాడు.