హాలీవుడ్ కి యువన్ శంకర్ రాజా

సంగీత ప్రపంచంలో ఎన్నో అద్భుతగీతాలను అందించిన మాస్ట్రో ఇళయరాజాకి వారసుడిగా సినీ ఇండస్ట్రీకి వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ యువన్శంకర్ రాజా. కెరీర్ ప్రారంభం నుంచి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించిన యువన్ ఇప్పటి వరకూ 100కి పైగా సినిమాలకు మ్యూజిక్ అందించడమే కాకుండా తనకంటూ ఓ ప్రత్యెక గుర్తింపును తెచ్చుకున్నాడు. యువన్ తెలుగులో మ్యూజిక్ అందించిన హ్యాపీ, రాజు భాయ్, పంజా, గోవిందుడు అందరివాడేలే లాంటి సినిమాలు మ్యూజికల్ గా పెద్దహిట్ అయ్యాయి. ఇన్ని రోజులు సౌత్ మరియు ఒకటి అరా పాటలతో బాలీవుడ్ లో మెరిసిన యువన్ ఓ యానిమేషన్ ఫిల్మ్ తో ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం కానున్నాడు.అలనాటి తమిళ్ లెజండ్రీ యాక్టర్ ఎంఆర్ రాధ మనవడు ప్రభాకరన్ హరిహరన్ రచన దర్శకత్వంలో ‘వూల్ ఫెల్’ అనే ఓ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిల్మ్ ని తీస్తున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా యువన్ శంకర్ రాజాని సెలక్ట్ చేసారు. ఇప్పటికే యువన్ ఈ సినిమా ట్రైలర్ కి సంబందించిన మ్యూజిక్ ని ఫినిష్ చేసాడు. ఒక్కసారి షూటింగ్ మొత్తం పూర్తయ్యాక యువన్ ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని స్టార్ చేస్తాడు. నేషనల్ అవార్డు ఎడిటర్ అయిన ప్రవీణ్ కెఎల్ ఈ సినిమాకి ఎడిటింగ్ చేస్తున్నాడు. రోబోటిక్స్ తో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ యానిమేషన్ ఫిల్మ్ ఉండనుంది.