బాహుబలి 2 డిసెంబర్ నుంచి మొదలు

2015 అనే ఏడాది తెలుగు చిత్ర సీమకి ఎంతో గర్వంగా ఫీలయ్యేలా చేసిన ఏడాది.. ఎందుకంటే ఈ ఏడాది టాలీవుడ్ స్థాయిని సౌత్ నుంచి హాలీవుడ్ కి పరిచయం చేసిన సినిమా ‘బాహుబలి’ విడుదలై, కలెక్షన్స్ పరంగా ఇండియన్ బాక్స్ ఆఫీసు ని కొల్ల గొట్టింది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు ఇంటర్నేషనల్ గా కూడా రిలీజ్ అవ్వడానికి సిద్దమైంది. ఒక తెలుగు సినిమాకి ఈ రేంజ్ ఘనతని తెచ్చి పెట్టిన క్రెడిట్ దర్శకధీరుదు ఎస్ఎస్ రాజమౌళికే చెందింది. ముందుగా బాహుబలి చైనా, జపాన్, లతో పాటు పలు ఏషియన్ కంట్రీస్ లో కూడా రిలీజ్ కావడానికి సిద్దమవుతుంటే రాజమౌళి మాత్రం బాహుబలి పార్ట్ 2 పనుల్లో బిజీ అయిపోతున్నాడు.

ఇటీవలే అందరూ కూర్చొని బాహుబలి పార్ట్ 2 స్క్రిప్ట్ వర్క్ ని ఫైనల్ చేసారు. అది అయిపోగానే రాజమౌళి తన టీంతో కలిసి సెట్ వర్క్ కి సంబందించిన వర్క్ ని మొదలు పెట్టారు. ప్రస్తుతం టీం అంతా మళ్ళీ ఫాంలోకి వచ్చి బాహుబలి 2 కోసం సెట్స్ ని నిర్మించే పనిలో ఉన్నారు. బాహుబలి రెండవ పార్ట్ ఫస్ట్ పార్ట్ కన్నా బెటర్ గా ఉండాలని వార్ ఎపిసోడ్ ని మళ్ళీ రీ డిజైన్ చేసారు. తాజాగా రాజమౌళి బాహుబలి 2 సినిమా రెగ్యులర్ షూటింగ్ ని డిసెంబర్ నుంచి మొదలు పెట్టనున్నామని అనౌన్స్ చేసాడు. ప్రస్తుతం బాహుబలి పార్ట్ కోసం ప్రభాస్ వర్క్ అవుట్స్ చేస్తూ బాడీని పెంచే పనిలో బిజీగా ఉంటే అనుష్క ఈ సినిమా కోసం సన్నబడే పనిలో ఉన్నాడు