Speaking Freely

తెదేపా పాలనకు ప్రజలిచ్చే ర్యాంకు ఎంతో ?

April 19, 2016 Posted By 0 comments
తెదేపా పాలనకు ప్రజలిచ్చే ర్యాంకు ఎంతో ?
ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించి సిఎం చంద్రబాబు ర్యాంకులు ఇచ్చారు. కుమారుడుతో పాటు కొంతమంది జంప్ జిలానీ ఎమ్మెల్యేలను మంత్రులను చేసేందుకువీలుగా సర్వే ద్వారా సంకేతాలు పంపారని నేతలు చెప్పుకుంటున్నారు.  తెదేపా పాలనకు ప్రజలిచ్చే ర్యాంకు ఎంతో చంద్రబాబు తెలుసుకోవాలి. చంద్రబాబు పాదయాత్రచేసి ఊరికో వాగ్దానం, మాటల గారిడీతో ప్రజలను మాయ చేసి అధికారంలోకి వచ్చారు. హామీలను అమలు చేయడంలో ఎంత చిత్తశుద్ది ఉందో ప్రజలకు ఇప్పుడు తెలిసిపోయింది. రాజధాని నిర్మాణంలో బినామీల భూఆక్రమణలు, సిఎం సామాజికవర్గానికి చెందిన మంత్రులు, […]Full Article

మానవ హక్కులు కాపాడే సమత సైనిక దళ్

April 16, 2016 Posted By 0 comments
మానవ హక్కులు కాపాడే సమత సైనిక దళ్
వరంగల్ జిల్లా హనుమకొండ పట్టణములో మొదటిసారి నిర్వహించిన సమతా సైనిక్ దళ్ శిక్షణ శిబిరం విజయవంతమయింది. సమాజంలో అణచివేతకు గురవుతున్న వర్గాల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా సమతా సైనిక్ దళ్ ను బాబాసాహెబ్ డా.బి.ఆర్.అంబేద్కర్ 25 నవంబర్ 1926లో స్థాపించారు. ఏప్రిల్ 8 నుండి14 వరకు 7 రోజులపాటు శిక్షణ కార్యక్రమాల్లో బహుజన దళిత యువత పాల్గొన్నారు. పట్టణ వీధులగుండా సాగిన సైనికుల కవాతులో యువతతోపాటు పిల్లలూ ఉత్సాహాంగా పాల్గొన్నారు. శిక్షణా శిబిరంలో ప్రముఖ గుండె శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ ఎం.ఎఫ్. గోపినాథ్, […]Full Article

వెంకయ్య లాంటి వారు అధికారాన్ని వదులుకున్నప్పుడే కుల నిర్మూలన

April 13, 2016 Posted By 0 comments
వెంకయ్య లాంటి వారు అధికారాన్ని వదులుకున్నప్పుడే కుల నిర్మూలన
దేశంలో కులవ్యవస్థ నిర్మూలించాలంటూ మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకల్లో వెంకయ్య నాయుడు ప్రసంగించటం హాస్యాస్పదంగా ఉంది. కుల ప్రయోజనాలు పొందే అగ్రకులాలు వారు కులవ్యవస్థ నిర్మూలించాలంటూ ఒక వైపు, కులవ్యవస్థపై చర్చించడమే కులతత్వం అని ఇంకోవేపు, మరియు తమ దోపిడీ సమర్ధించుకోవడానికి రిజర్వేషన్స్ అనే సాకును  చూపే  ధోరణి పెరిగిపోతుంది. ఇంతకీ కుల నిర్మూలన అంటే ఏంటి?  కుల అసమానత్వాల ఆధిపత్యాలు  నిర్మూలన. అధికార వ్యవస్థల్లో మైనారిటీ అగ్రకులాల వారు పొందుతున్న అత్యధిక ప్రాతినిధ్యం వదులుకోవాలి. ఈ అధికారంతోనే వారు, బ్యాంకుల్లో డబ్బును, […]Full Article

అయోమయం పవన్ కళ్యాణ్ రాజకీయాలకు దూరంగా ఉండాలి

April 11, 2016 Posted By 0 comments
అయోమయం పవన్ కళ్యాణ్ రాజకీయాలకు దూరంగా ఉండాలి
సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలకు ముందు స్థానిక మీడియాను లైట్ తీసుకుని కేవలం జాతీయ మీడియాకే ఇంటర్వ్యూలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ సినిమా విడుదలయ్యాక వచ్చిన నెగటివ్ టాక్ తో రూట్ మార్చి తెలుగు మీడియాతో మనసువిప్పి మాట్లాడారు. జీవితం గడవడానికి కావాల్సిన కొద్ది డబ్బు సంపాదించి, పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చేద్దామనుకొంటున్నానని చెప్పారు. రాజకీయాల్లో ఇప్పటికే మెగా ఫ్యామిలీని దగా ఫ్యామిలీ అంటూ పిలుస్తున్నారు. కనీసం కాపు సామాజికవర్గం ఓట్లను కూడా పొందలేని వారు కేవలం  వోట్ బ్రోకర్స్ గా మిగిలిపోతారనే విమర్శలున్నాయి. బహుశా […]Full Article

మనువాద కారుకూతలు కూసే చాగంటి సలహాలతో ఆంధ్ర వికాసమా?

April 9, 2016 Posted By 0 comments
మనువాద  కారుకూతలు కూసే చాగంటి సలహాలతో ఆంధ్ర వికాసమా?
భర్త స్నానం చేసాక విడిచిపెట్టిన బట్టను పిడిచి ఆరేయడం భార్య  ప్రధాన కర్తవ్యం అని ,ఇలా చెయ్యడం వలన బ్రాహ్మణులకు గోదానం చేసినంత పుణ్యమని అప్పుడే భర్త ఆరోగ్యంగా ఉంటారని అన్న  చాగంటి కోటేశ్వరరావుకి అవధాన రంగంలో కళారత్న పురస్కారం దక్కింది. అంతకు మించి రాష్ట్రప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. కాబినెట్ హోదా సౌకర్యాలు అన్ని దొరికాయి . చాగంటి కోటేశ్వరరావుని ఒక్క విషయంలో మెచ్చుకోవచ్చు బ్రాహ్మణ వర్ఘ  పవిత్రత, తన కులలాభం, తన కులసంస్కృతి హిందూ ధర్మంగా  మొహమాటం లేకుండా చెబుతారు. బ్రాహ్మణవాదంతో    నిమ్నకులాలను చీల్చి […]Full Article

ఉగాది: రబీ పంట వేడుకగా చేసుకునే పండుగ

April 7, 2016 Posted By 0 comments
ఉగాది: రబీ పంట వేడుకగా చేసుకునే పండుగ
ఇప్పుడు ఉగాది గా పిలవబడుతున్న  పండుగ పూర్వం సంచార తెగలుగా జీవించే మనం నెమ్మదిగా నదీ తీరాలు వెంబడి వ్యవసాయ ఆధార సమాజాలుగా పరివర్తన చెందుతున్న కాలాన్ని గుర్తుచేసే ఒక సంప్రదాయం. భూమి పునరుత్పత్తికి సూచికంగా, మంచి రబీ పంటను కోరుకుంటూ వ్యవసాయక శూద్ర, అతి శూద్రులు పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను ద్రావిడ భాషలు మాట్లాడే ప్రజలు మరాఠీ ప్రాంతానికి వ్యాప్తి చేసారు. అక్కడ ఈ పండుగ గుడి పడ్వా గా పేరుపొందింది.  ప్రస్తుతం ప్రాచుర్యం లో ఉన్నటు  ఇది  బ్రాహ్మణ క్యాలెండర్స్ […]Full Article

మనువాద  కేంద్రంగా  మారిన  పాలమూరు యూనివర్సిటీ

April 5, 2016 Posted By 0 comments
మనువాద  కేంద్రంగా  మారిన  పాలమూరు యూనివర్సిటీ
అగ్రవర్ణాలు వెనుకబడిన వర్గాల వారిని అనేక తరాలుగా విద్యకు దూరం చేసి తామెంతో ప్రత్యేకమైనవారమనే విర్రవీగేవారు.  ఇతర వర్గాల విద్యార్థులు  విద్యారంగంలో దూసుకుపోతుండటంతో  ఏబివిపి వంటి సంస్థలు పెట్టి  మనువాద తెలివితో వెనుకబడిన వర్గాల విధ్యార్థులనే రెచ్చగొట్టి  వారితోటి  ఎస్టీ, దళిత,  విధ్యార్థులపైనే దాడులు చేయిస్తున్నారు . వెనుకబడిన వర్గాల వెంటనే వారు మేల్కోకపోతే ఏబివిపి కుట్రల్లో నాశనమవుతారు. . పాలమూరు యూనివర్సిటీ కేర్ టేకర్ పర్వతాలు గత ఎనిమిది నెలలుగా మెస్ బిల్లులు డిస్ ప్లే చేయడం లేదు. సాధారణంగా రూ. 12 […]Full Article

భక్తి ముసుగులో కుల ప్రయోజనాలు చూసుకుంటున్న స్వాముల

April 2, 2016 Posted By 0 comments
భక్తి ముసుగులో కుల ప్రయోజనాలు చూసుకుంటున్న స్వాముల
అసలు పుట్టుకతోనే  ఒక వర్ఘానికి బ్రాహ్మణ గుర్తింపు అనేదే పెద్ద కుంభకోణం. దానికి తగ్గటే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా తరఫున వివిధ  పీఠాధిపతులు, స్వాములు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లు భాజపా తెలిపింది. పుట్టుకతోనే బ్రాహ్మణత్వం బిరుదు తగిలించుకుంటున్న వల్ల  కులమే మతంగా  మారిపోయింది. దేవుడు, భక్తీ , హిందూ ముసుగులో తమ కుల ప్రయోజనాలు ప్రచారం చేసుకుంటున్నారు. దీనితో ప్రజలలో  సమాజ సేవ, సమానత్వం  విలువలు పోయి  ఒక వర్ఘం పవిత్రులు ఇంకొకరు అపవిత్రులు అనే భావం , కులతత్వం , బ్రాహ్మణులకు దానాలు […]Full Article

కులరాజ్యం అమలు జరిపే అధికారులుగా పోలీస్ ఆఫీసర్లు!

April 1, 2016 Posted By 0 comments
కులరాజ్యం అమలు జరిపే అధికారులుగా పోలీస్ ఆఫీసర్లు!
చీరకట్టులో  ఎంతో అందంగా ఉంటారని ఒక పత్రిక ప్రశంసిస్తే అగ్రవర్ణ  ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సభర్వాల్  తీవ్రఆగ్రహం వ్యక్తం  చేసి  పోలీస్ అధికారి అయిన తన  భర్త  సహాయంతో  క్రిమినల్ కేసులు నమోదు చేసారు. సదరు పత్రిక క్షమాపణ చెప్పినా ఊరుకోలేదు. ఆమె కోర్టు ఖర్చుల కోసం తెలంగాణ ప్రభుత్వం లక్షల రూపాయలను కేటాయించి శ్రద్ధ చూపింది. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వీసీ అప్పారావు  నిరసన  తెలిపిన  విద్యార్థినులపట్ల ఇదే పోలీసులు అనుచితంగా ప్రవర్తిస్తూ రేప్ చేస్తామని బెదిరించినట్టు గణిత ప్రొఫెసర్ తధాగతసేన్ గుప్తా […]Full Article

ఐలయ్యగారూ డా.అంబేద్కర్ రాజ్యాంగం ఇంకా మనుగడలో ఉందా?

March 31, 2016 Posted By 0 comments
ఐలయ్యగారూ డా.అంబేద్కర్ రాజ్యాంగం ఇంకా మనుగడలో ఉందా?
నిన్నటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ‘భీమ్ భూమీకీ జై’ అంటూ కంచె ఐలయ్య ఎడిటోరియల్ ఆర్టికల్ రాసారు. రాజ్యాంగానికి ప్రాణం పోసింది డా.అంబేద్కర్ గనుక ఆయనకూ, ఈ నేలకూ సంబంధాన్ని సూచించే జాతీయవాద నినాదం ఇప్పుడు కావాలంటున్నారు. అందుకనుగుణంగా దళిత బహుజనుల కోసం డా.ఐలయ్య ‘భీమ్ భూమీకీ జై’ అనే నినాదాన్ని ప్రతిపాదించారు. ఐలయ్య గారి నినాదం బాగానే ఉంది కానీ డా.అంబేద్కర్ అందించిన రాజ్యాంగం సామ్రాజ్యవాది నెహ్రూ, ఆర్ఎస్ఎస్ అగ్రవర్ణాలను ప్రతిబింబిస్తూ ఎప్పుడో మార్పులకు లోనయ్యింది. మోసాలు జరుగుతుంటే రాజ్యాంగ ఆధార జాతీయవాదాన్ని ఎలా […]Full Article