Tazaa Varthalu

ఢిల్లీలో రాష్ట్రపతి పాలన

October 29, 2014 Posted By 0 comments
ఢిల్లీలో రాష్ట్రపతి పాలన
ప్రజాస్వామ్యదేశంలో ఎనిమిది మాసాలకుపైగా ఢిల్లీలో రాష్ట్రపతి పాలన కొనసాగుతుండటం ఎంతమాత్రం అమోదయోగ్యంకాదని సుప్రీంకోర్ట్ తేల్చి చెప్పింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, కేంద్ర ప్రభుత్వాలకు ప్రజాస్వామ్య విలువలు గుర్తుచేసింది. గతసంవత్సరం డిసెంబరులో వచ్చిన అసెంబ్లీ ఫలితాల్లో ప్రజలు ఏ రాజకీయ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత ఇవ్వలేదు. కాంగ్రెస్ మద్దతుతో ఆమ్ ఆద్మీ పార్టీ(ఎ.ఎ.పి) ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. జనలోక్ పాల్ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందకపోవటంతో అరవింద్ కేజ్రివాల్ తన 49 రోజుల ప్రభుత్వాన్ని 2014 సంవత్సరం ఫిబ్రవరి నెలలో అర్దాంతరంగా రద్దు చేసారు. […]Full Article

షూమాకర్ అభిమానులకు శుభవార్త

October 28, 2014 Posted By 0 comments
షూమాకర్ అభిమానులకు శుభవార్త
ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలో ఉన్న ప్రఖ్యాత ఫార్ములా రేసర్ మైకేల్ షూమాకర్ కోమా నుంచి త్వరలోనే కోలుకోవడం ఖాయమని ఆయనకు చికిత్స చేస్తున్న వైద్యులు వెల్లడించారు. 2013 డిసెంబర్లో షూమాకర్ ప్రమాదానికి గురైనప్పటి నుంచి ఆయనకు చికిత్స చేస్తున్న ఓ ఫ్రెంచ్ ఫిజిషియన్ ఈ వివరాలు తెలిపాడు. షూమాకర్ కోమా నుంచి బయటకు రావడానికి గరిష్ఠంగా మూడేళ్లు పడుతుందని అంచనా వేశారు. ఆలోపు కూడా కోమా నుంచి కోలుకోవచ్చని చెబుతున్నారు.Full Article

ఫెడ్నవిస్ కు గుడ్ బై, రేసులో గడ్కరీ..?

October 28, 2014 Posted By 0 comments
ఫెడ్నవిస్ కు గుడ్ బై, రేసులో గడ్కరీ..?
మరాఠా రాజకీయాలు క్షణక్షణం మలుపులు తిరుగుతున్నాయి. ఇప్పటివరకూ రేసులో ముందున్న మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ పేరు కాస్తా ఇప్పుడు పక్కకు పోతోంది. రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి లేదని, సీఎం రేసులో లేనని ప్రకటించిన గడ్కరీ పేరు తెరపైకి వస్తోంది. ఎమ్మెల్యేలు రెండుగా చీలిపోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. దీంతో ఫడ్నవిస్ కు గుడ్ బై చెబుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలా వద్దా అన్న అంశంపై శివసేన ఎటూ తేల్చలేకపోతోంది. ఇన్నాళ్లూ సీఎం పదవిపై ఆశలు […]Full Article

దమ్ముంటే చెప్పండి, చెబితే దిమ్మ తిరిగినట్లే..!

October 28, 2014 Posted By 0 comments
దమ్ముంటే చెప్పండి, చెబితే దిమ్మ తిరిగినట్లే..!
నల్ల కుబేరుల జాబితా త్వరలోనే బయటపెడతామని కేంద్ర ఆర్థిక, రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. మొన్నటికి మొన్న మంత్రివర్గ సహచరుల విందులో కొందరి పేర్లు బయటపెడదామని మోడీ చెప్పిన నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తాము ప్రకటించే పేర్లతో కాంగ్రెస్ నేతలకే దిమ్మ తిరుగుతుందంటున్నారు జైట్లీ. అయితే బీజేపీకి దమ్ముంటే బ్లాక్ లిస్టులోని పేర్లు ప్రజల ముందుకు తేవాలని సవాల్ చేస్తోంది. నల్లకుబేరుల జాబితా చెప్పడమేంటోగానీ.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మరింత మాటల తూటాల పేలడం ఖాయంగా కనిపిస్తోంది.Full Article

నీరు, విద్యుత్ పంచాయితీకి రాజీ ఫార్ములా

October 28, 2014 Posted By 0 comments
నీరు, విద్యుత్ పంచాయితీకి రాజీ ఫార్ములా
రెండురాష్ట్రాల మధ్య జలజగడాలకు ఇప్పుడప్పుడే పుల్ స్టాప్ పడేలా కనిపించడం లేదు. కృష్ణా రివర్ బోర్డు సామరస్యంగా, భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని సమస్య పరిష్కరించుకోవాలని సూచించింది. అయితే పరిస్థితులు మాత్రం ఏమాత్రం సుహృద్భావంగా కనిపించడం లేదు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కూచుని మాట్లాడే పరిస్థితులూ లేవు. దీంతో గవర్నర్ నరసింహన్ రంగప్రవేశం చేశారు. ఏ సమస్యకైనా చర్చల ద్వారా పరిష్కారం దొరుకుతుందని రాజీ ఫార్ములా సూచించారు. ఎడతెగని సమస్యలతో ప్రజలకు ఇబ్బంది తప్పదన్నారు. విద్యుత్ సమస్యను కేంద్రం, నీటి వివాదాన్ని కృష్ణా […]Full Article

ఫస్ట్ బ్లాక్ లిస్ట్ రిలీజ్

October 28, 2014 Posted By 0 comments
ఫస్ట్ బ్లాక్ లిస్ట్ రిలీజ్
కేంద్రప్రభుత్వం ఎట్టకేలకు సాహసం చేసింది. విపక్షాల నుంచి విమర్శలు పెరిగిపోయే సరికి కొందరి పేర్లైనా వెల్లడించాలనుకుంది. ముగ్గురి పేర్లను సుప్రీంకు తెలిపింది. కారణమేంటోగానీ రాజకీయ నాయకుల జోలికి వెళ్లలేదు. డాబర్ గ్రూపు మాజీ డైరెక్టర్ ప్రదీప్ బర్మన్, గోవా గనుల కింగ్ రాధా టింబ్లో, గోల్డ్ వ్యాపారి చమన్ లాల్. ఈ ముగ్గురే తొలి బ్లాక్ లిస్టు రూపంలో బయటికొచ్చారు. ముగ్గురేనా? విదేశాల్లో బ్లాక్ మనీ దాచుకున్న భారతీయుల పేర్లు వెల్లడించాలని గతంలో బీజేపీ, యూపీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇప్పుడేమో తాము అధికారంలోకి […]Full Article