Health & Beauty

మధుమేహం గుప్పిట్లో ప్రపంచం..

November 14, 2014 Posted By 0 comments
మధుమేహం గుప్పిట్లో ప్రపంచం..
కడుపునిండా తినాలంటే భయం. అసలు ఏది తినాలో.. ఎప్పుడు తినాలో.. ఎంత తినాలో.. ఎలా తినాలో కూడా లెక్కే. కాస్త ఎక్కువైనా ప్రమాదమే. తక్కువైనా చిక్కే. ఇక తీపి పదార్థాలను చూస్తే నోరూరినా నాలుక కట్టుకోవాల్సిందే. మనసు చంపుకోవాల్సిందే. రుచిగా ఉందని కసిగా లాగిస్తే తరువాత నానాపాట్లు పడాల్సి వస్తుంది. అదే డయాబెటిస్. 2012లో 15 లక్షల మంది మరణానికి ఇదే కారణం. ఒక్కసారి వస్తే జీవితమంతా చేదును మిగిల్చే భయంకరమైన వ్యాధి. ఇప్పుడు ప్రపంచాన్నే కబళించడానికి చాపకింద నీరులా విస్తరిస్తోంది. డయాబెటీస్ ఒక్కసారి […]Full Article

డెంటిస్ట్ నిర్లక్ష్యం.. 22 వేలమందికి హెచ్ ఐవీ టెస్టులు..

November 13, 2014 Posted By 0 comments
డెంటిస్ట్ నిర్లక్ష్యం.. 22 వేలమందికి హెచ్ ఐవీ టెస్టులు..
నాటింగ్ హామ్ ప్రాంతంలో చాలా కాలం నుంచి ఓ డాక్టర్ దంతవైద్యం చేస్తూ స్థిరపడ్డాడు. ఆయన దగ్గర చాలా మంది వైద్యం చేయించుకున్నారు. అయితే సరైన పద్ధతులు అవలంబించని కారణంగా.. రక్తంతో సంక్రమించే వ్యాధులు ఇప్పటివరకూ అక్కడ చికిత్స చేసుకున్న వారికి ప్రాణసంకటంగా మారాయని గుర్తించారు. ఇప్పటి వరకూ అక్కడ చికిత్స తీసుకున్న 22 వేల మందిని గుర్తించాలని నిర్ణయించారు. యూకే మెడికల్ హిస్టరీలో ఇదే అతిపెద్ద ఘటనగా అభివర్ణిస్తున్నారు. ఇందుకోసం హెల్ప్ లైన్ కూడా ప్రారంభించారు. చికిత్స చేసుకున్న వారు హెచ్ ఐవీ, […]Full Article

కొబ్బరినూనెతో వెయిట్ లాస్?

November 13, 2014 Posted By 0 comments
కొబ్బరినూనెతో వెయిట్ లాస్?
సాధారణంగా కొకొనట్ ఆయిల్ చర్మం, కేశాల సంరక్షణకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కానీ ఈ నూనెను వంటకాల్లో వినియోగిస్తే శరీరబరువు తగ్గే అవకాశం ఉందని గుర్తించారు. ఇప్పటికే ఆలివ్ ఆయిల్ వాడితే శరీరంలోని కెలోరీలను తగ్గిస్తుందని నిర్ధారించారు. ఫ్రైలు సహా ఇతర కర్రీల కోసం ఆలివ్ ఆయిల్ వాడితే మంచి ఫలితాలుంటాయని ఇప్పటికే ఎంతో మంది తేల్చారు. తాజాగా కొబ్బరి నూనె కూడా వాడితే ఫలితం బాగుంటుందని చెబుతున్నారు. కొబ్బరి నూనెను వంటల్లో కేరళ సహా పలు ప్రాంతాల్లో ఇప్పటికే వినియోగిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో […]Full Article

కల్తీపాలతో ఆరోగ్యం గుల్ల…

November 12, 2014 Posted By 0 comments
కల్తీపాలతో ఆరోగ్యం గుల్ల…
తెల్లవన్నీ పాలు కాదు. ఇది జనం గుర్తించేదాకా నష్టమే. కారణం.. కల్తీ పాల ముఠాలు దేశవ్యాప్తంగా పెరిగిపోయాయి. తక్కువ సమయంలో ఎక్కువ రాబడి పొందేందుకు పాలను కృత్రిమంగా తయారు చేస్తూ జనం ప్రాణాలతో ఆటలాడుతున్నారు. ఎరువులు, రసాయనాలతో పాలు తయారు చేస్తూ క్యాన్సర్లు, రకరకాల వ్యాధులకు కారణమవుతున్నారు. వీరిపై పటిష్ఠ నిఘా లేకపోవడంతో వారి ఆటలు సాగుతున్నాయి. కల్తీ పాల ముఠాలు గల్లీగల్లీకి వెలుస్తున్నాయి. దీనిపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కల్తీపాల ముఠాలకు విరుగుడుగా కఠిన చట్టాన్ని […]Full Article

టీనేజీ అమ్మాయిలూ జర జాగ్రత్త..

November 11, 2014 Posted By 0 comments
టీనేజీ అమ్మాయిలూ జర జాగ్రత్త..
సరైన జీవనశైలి లేకపోవడం ఎన్నో సమస్యలకు కారణమవుతుంది. సరైన సమయంలో నిద్ర, తిండి, వ్యాయామం, మంచి ఆహార అలవాట్లు లేకపోతే రకరకాల సమస్యలు టీనేజీ నుంచే వేధిస్తుంటాయి. భారతీయ టీనేజీ యువతుల్లో లైఫ్ స్టైల్ మార్పులతో పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్… పెరుగుతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. టీనేజీ యువతుల ఆహార అలవాట్లు, సరైన జీవనశైలి లేకపోవడంతో అండాశయ సమస్యలు ఎక్కువవుతున్నాయని వైద్యులు గుర్తించారు. దీనితో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతోందని.. ఫలితంగా అండాశయంలో తిత్తులు ఏర్పడుతున్నాయని గుర్తించారు. 10 – 30 శాతం టీనేజీ యువతుల్లో కామన్ […]Full Article

వృద్ధులకూ వ్యాక్సిన్లు..

November 10, 2014 Posted By 0 comments
వృద్ధులకూ వ్యాక్సిన్లు..
మలివయసులో ఎన్నో రోగాలు చుట్టుముడుతుంటాయి. వాటికి చెక్ పెట్టాలంటే ఇమ్యునైజేషన్ తప్పని సరి అంటున్నారు వైద్యులు. 60 ఏళ్లు పైబడిన వారిలో డయాబెటిస్, హైపర్ టెన్షన్, కిడ్నీ, ఊపిరితిత్తి వ్యాధులు కనిపిస్తుంటాయి. తరచూ కీళ్ల నొప్పులతోనూ సతమతమవుతుంటారు. అలాంటి వారికి వ్యాక్సినేషన్ తో ఉపశమనం కలుగుతుందంటున్నారు డాక్టర్లు. వృద్ధాప్యంలో ఏడాదికి ఒకసారి ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకుంటే హాస్పిటల్ వెళ్లడంలో 60 శాతం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.Full Article

తెలివితేటలు, చురుకుదనం కావాలంటే అది తినాల్సిందే!

October 31, 2014 Posted By 0 comments
తెలివితేటలు, చురుకుదనం కావాలంటే అది తినాల్సిందే!
ఆఫ్రికా ఖండం, కెన్యా దేశంలో సూక్ష్మపోషకవిలువల లోపంగల ఏడు సంవత్సరాల పిల్లలను నాలుగు గ్రూపులుగా విభజించి రెండు సంవత్సరాల కాలపరిమితిలో ఒక పరిశోధన చేశారు. మొదటి గ్రూపు బాలలకు పిండిపదార్ధాలు, తక్కువ పోషకవిలువలగల జొన్నలు, బీన్స్ ఆహారంగా, రెండవ గ్రూపులో పిల్లలకు రెండు స్పూన్ల మాంసాహారం ప్రతి రోజూ అదనపు ఆహారంగా అందించారు. మూడవ గ్రూపులో గ్లాస్ పాలు లేదా అంతే శక్తిగల నూనెతో చేసిన ఆహారపదార్ధాలను, నాలుగవ గ్రూపులో ఎటువంటి మార్పులు లేకుండా ఎప్పుడూ వారు తినే ఆహారాన్నే తీసుకున్నారు. రెండు సంవత్సరాల […]Full Article

మీ మెదడు కెలరీలను కౌంట్ చేస్తుంది!

October 28, 2014 Posted By 0 comments
మీ మెదడు కెలరీలను కౌంట్ చేస్తుంది!
అవును. మానవ మెదడు పవర్ ఎంతో. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే శక్తి దానికుంది. మనం మెదడు శక్తిని కనీసం 10 శాతం కూడా వినియోగించం. పూర్తిగా వాడితే అద్భుత ఫలితాలే. మెదడు తనకు తాను ఎంతలా పని చేస్తుందన్న విషయం మరోసారి రుజువైంది. మెదడులో స్వతహాగా కెలోరీ కౌంటర్ ఉంటుందని.. ఏదైనా సూపర్ మార్కెట్ కు వెళ్లినప్పుడు ఏయే పదార్థాలు అవసరమో, అవి శరీరానికి ఎంత అవసరమో లెక్కేసుకుంటుందట. ఆ ప్రకారం మనల్ని వస్తువులు కొనేలా చేస్తుందని ఓ అధ్యయనం తేల్చి చెప్పింది.Full Article

ఫ్రై కోసం.. హెల్త్ కోసం ఆలివ్ ఆయిల్

October 28, 2014 Posted By 0 comments
ఫ్రై కోసం.. హెల్త్ కోసం ఆలివ్ ఆయిల్
మీకు ఫ్రై చేసిన కర్రీలు, ఇతర ఆహారపదార్థాలు ఇష్టమా? నూనెలు ఎక్కువగా వాడకూడదని తింటే కొలెస్ట్రాల్ సహా కొవ్వులు పేరుకుపోతాయన్న సంగతి తెలిసిందే. అయితే ఒక్కసారి ఆలివ్ ఆయిల్ ట్రై చేసి చూడాలంటున్నారు నిపుణులు. దీనితో ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్టుకు టేస్ట్ లభిస్తుందంటున్నారు. శాస్త్రవేత్తలు నాలుగు వేర్వేరు రకాలైన నూనెలను తీసుకుని పొటాటోలను డీప్ ఫ్రై చేశారు. అయితే గింజల నుంచి వచ్చిన నూనెల కంటే ఆలివ్ ఆయిల్ పోషక విలువలను స్థిరంగా ఉంచినట్లు గుర్తించారు. వేడి చేసినప్పుడు ఒక్కో రకం నూనె ఒక్కో […]Full Article

రోజూ తలనొప్పితో నిద్రలేస్తున్నారా??

October 28, 2014 Posted By 0 comments
రోజూ తలనొప్పితో నిద్రలేస్తున్నారా??
రోజూ నిద్రలేస్తూనే తలనొప్పితో లేవడం ఈ రోజుల్లో సర్వసాధారణంగా కనిపిస్తోంది. వీటికి చెక్ పెట్టాల్సిందే. లైట్ తీసుకుంటే కుదరదంటున్నారు డాక్టర్లు. ఏయే కారణాలతో తలనొప్పి వస్తోందన్న విషయంపై ఫోకస్ పెట్టాలి. ఇందుకు కారణాలెన్నో కనిపిస్తుంటాయి. సరిగా నిద్ర పట్టకపోవడం, ఆలస్యంగా నిద్రకు ఉపక్రమించడం, పీడకలలు, భారీ అలారం సౌండ్లు, సరైన తలగడ లేకపోవడం ఇవన్నీ సమస్యలే. వీటిని అధిగమిస్తే తలనొప్పి సమస్య చాలా వరకు తగ్గుతుంది. ముఖ్యమైన పని ఉన్న రోజు తలనొప్పితో నిద్రలేస్తే చిన్న చిట్కా పాటిస్తే చాలు నొప్పు హుష్ కాకి. […]Full Article