Health & Beauty

బ్రకోలితో చెడు కొలెసా్ట్రల్‌కు చెక్‌

April 17, 2015 Posted By 0 comments
బ్రకోలితో చెడు కొలెసా్ట్రల్‌కు చెక్‌
కొత్త రకం బ్రకోలిని డైట్‌లో చేర్చుకోవడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. చెడు కొలెసా్ట్రల్‌ 6 శాతం మేర తగ్గుతుంది. ఈ విషయం ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడయింది. సహజ సిద్ధంగా లభించే మిశ్రమం ‘గ్లూకోరఫనిన్‌’ సాధారణ బ్రకోలి రకంతో పోల్చితే కొత్త రకం బ్రకోలిలో రెండు, మూడు రెట్లు ఎక్కువగా లభిస్తుంది. ఈ రకం ఇప్పటికే ‘బెనెఫోర్ట్‌’ పేరుతో బ్రిటిష్‌ సూపర్‌మార్కెట్లలో లభిస్తోంది. ‘‘గ్లూకోరఫనిన్‌ అధికంగా తీసుకున్న మనుషులపై జరిపిన రెండు వేరు వేరు పరిశోధనల్లో ప్లాస్మా ఎల్‌డీఎల్‌-సి (లో డెన్సిటీ […]Full Article

ఆరోగ్యానికి బొట్టు బిళ్ల

April 15, 2015 Posted By 0 comments
ఆరోగ్యానికి బొట్టు బిళ్ల
నుదుటన దిద్దుకునే బొట్టు సింగారానికి మాత్రమే కాదు, ఇక పై ఎంతోమంది స్త్రీలకు ఆరోగ్యాన్ని, జీవితాన్ని ప్రసాదించబోతోంది. రోజు రోజుకి దేశంలో పెరుగుతున్న అయోడిన్ లోపం వలన స్త్రీలు, వారికి పుట్టబోయే పిల్లలు అనేక ఆరోగ్య సమస్యలకు లోనవుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు గాను సింగపూర్‌కు చెందిన గ్రే గ్రూప్, నాసిక్‌లోని నీల్‌వసంత్ మెడికల్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్  కలిసి ఈ బిందీ రూపకల్పన చేశారు. దాదాపు ఏడు కోట్లమందికి పైగా భారతీయులు అయోడిన్ లోపంతో బాధ పడుతున్నట్లు […]Full Article

పచ్చిపాలు తాగొద్దు

April 7, 2015 Posted By 0 comments
పచ్చిపాలు తాగొద్దు
పచ్చిపాలు ఒంటికి మంచిది కాదంటున్నారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు పచ్చిపాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెబుతున్నారు. ఇటీవల చేసిన ఒక స్టడీలో ఈ విషయం వెల్లడైంది. పచ్చిపాలు తాగడం వల్ల ఆహారానికి సంబంధించిన విషతుల్యమైన బాక్టీరియా కడుపులోకి వెళ్లి తీవ్ర దుష్పరిణామాలు సంభవిస్తాయట. పచ్చిపాలు తాగడం వల్ల నీళ్ల విరేచనాలు, వాంతులు, కడుపులో పోట్లు, జ్వరం వస్తాయట. కొన్నిసార్లు మూత్ర పిండాలు దెబ్బతిని హఠాన్మరణం కూడా సంభవించవచ్చని ఈ స్టడీ పేర్కొంది. సూక్ష్మక్రిమిరహిత పాలు తాగడం వల్ల తలెత్తే […]Full Article

బ్లాక్ టీ

April 3, 2015 Posted By 0 comments
బ్లాక్ టీ
ఆరోగ్య సమస్యలను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటున్నారు ఇప్పుడంతా. అలా తయారైన కొత్త ఆహారప పదార్థాల లిస్టులోకి బ్లాక్ టీ కూడా చేరింది.  ఈ మార్పు ఎంతో మంచిదంటోంది అమెరికన్ హార్ట్ అసోసియేషన్. ఈ సంస్థ నిర్వహించిన ఓ పరిశోధనా ఫలితాలు బ్లాక్ టీ ప్రయోజనాల్ని బయటపెట్టాయి. అవేమిటంటే… బ్లాక్ టీ ‘కరొనరీ ఆర్టరీ డిస్‌ఫంక్షన్’ని తగ్గిస్తుందట. అందువల్ల గుండె జబ్బులతో బాధపడేవారు రోజూ కచ్చితంగా ఒక కప్పు బ్లాక్ టీ తాగటం మంచిదంటున్నారు. బ్లాక్ టీలో ఉండే రసాయనాలు […]Full Article

యాంటీ హెర్పిస్‌ మందుతో హెచ్‌ఐవీ నియంత్రణ

March 31, 2015 Posted By 0 comments
యాంటీ హెర్పిస్‌ మందుతో హెచ్‌ఐవీ నియంత్రణ
హెర్పిస్‌ వ్యాధి నివారణకు వాడే వాలసిక్లోవిర్‌ (వాలె్ట్రక్స్‌) హెచ్‌ఐవీ చికిత్సలోనూ ఉపయోగపడుతోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. శరీరంలోకి చేరిన హెచ్‌ఐవీ కొంతకాలం తర్వాత ఎయిడ్స్‌గా రూపాంతరం చెందుతుందనే విషయం తెలిసిందే! అయితే, యాంటీ హెర్పి్‌సగా ఉపయోగించే వాలె్ట్రక్స్‌ ఈ వైరస్‌ పునరుత్పత్తిని అదుపుచేయడం ద్వారా హెచ్‌ఐవీని నియంత్రిస్తోందని యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు వివరించారు. ఈమేరకు రెండు గ్రూపులుగా విభజించిన 18 మంది వలంటీర్లపై ప్రయోగం చేసి దీనిని నిర్ధారించుకున్నట్లు వర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ బెనింగో రోడ్రిగ్వెజ్‌ వివరించారు. ఈ పరిశోధనలో భాగంగా.. […]Full Article

పాలతో మెదడుకు ఆరోగ్యం

March 26, 2015 Posted By 0 comments
పాలతో మెదడుకు ఆరోగ్యం
మానసిక ఒత్తిడితో బాధపడుతున్నా రా..? జ్ఞాపకశక్తిలేమి మిమ్మల్ని ఇబ్బందిపెడుతోం దా..? అయితే మర్చిపోకుండా రో జూ పాలు తాగండి. ఎముకలు, కండరాలకు పాలు శక్తినిస్తాయని తెలుసు కానీ ఇదేంటీ ఎక్కడా వినలేదని ఆశ్చర్యపోవద్దు. శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ప్రకారం.. పాలతో మెదడు ఆరోగ్యంగా, చురుగ్గా ఉంటుందని, ఒత్తిడిని దూరం చేస్తుందని తేలింది. దాంతోపాటూ భవిష్యత్తులో అల్జిమర్స్‌, పార్కిన్సన్‌ తదితర వ్యాధులు వచ్చే ప్రమాదాన్నీ తగ్గిస్తాయట. ఈమేరకు యూనివర్సిటీ ఆఫ్‌ కాన్సస్‌ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో రోజూ పాలు తాగే వారి మెదడులో గ్లుటథియాన్‌ అనే […]Full Article

గుండెను ఆటంక పరిచే ఎంజైం

March 25, 2015 Posted By 0 comments
గుండెను ఆటంక పరిచే ఎంజైం
గుండె పనితీరును అడ్డుకొని మరణానికి కారణమవుతున్న ఎంజైమ్‌ను జాన్‌ హాప్కిన్స్‌ పరిశోధకులు కనుగొన్నారు. ప్రధానంగా గుండెకు ముప్పు కలిగించే రెండు ఎంజైములలో ఒకదాన్ని గతంలోనే కనుగొనగా.. తాజా అధ్యయనంలో పీడీఈ 9 గా వ్యవహరించే కొత్త ఎంజైమ్‌ జాడను పసిగట్టారు. గుండెపై ఒత్తిడి తగ్గించి దాని పనితీరు సాఫీగా సాగేందుకు పీకేజీ అనే ప్రొటీన్‌ తోడ్పడుతుందని వారు వివరించారు. ఈ ప్రొటీన్‌ ఉత్పత్తిని సిజీఎంపీ అణువులు నియంత్రిస్తుంటాయి. అయితే పీడీఈ 9 ఎంజైమ్‌ ఈ అణువులను ఆటంకపరచడం ద్వారా పీకేజీ ప్రొటీన్‌ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. […]Full Article

నిద్ర తక్కువైతే డయాబెటిస్

March 17, 2015 Posted By 0 comments
నిద్ర తక్కువైతే డయాబెటిస్
రాత్రి ఎంత లేట్ గా పడుకున్నా ఉదయం ఆరుగంటలకే నిద్ర లేవాల్సిందే. ఇక ఉద్యోగులు అయితే ఐదుగంటలకే నిద్రలేచి పనుల పరుగుల్లో అలసిపోవాల్సిందే. ఒకవైపు నిద్ర సరిగ్గా ఉండదు. మరొకవైపు అధిక పనుల వల్ల శారీరక సమస్యలు వస్తున్నాయి. నిద్రసరిగా పోకుండా నిర్లక్ష్యం చేసేవారికి డయాబెటిస్‌ త్వరగా సోకే ప్రమాదముందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. మూడు రోజులు వరుసగా తగినన్ని గంటలు నిద్రలేకపోతే శరీరంలో వచ్చే మార్పులలో ముఖ్యమైనది రక్తంలో గ్లూకోజ్‌ నియంత్రణగా గుర్తించారు. నియంత్రణ వ్యవస్థలో లోపం ఏర్పడటంతో షుగర్‌ జబ్బు వస్తుంది. బలవంతంగా […]Full Article

గ్రీన్ టీ మంచిదే… కానీ?!

March 13, 2015 Posted By 0 comments
గ్రీన్ టీ మంచిదే… కానీ?!
కొలెస్ట్రాల్ కరిగించడానికి, బరువు తగ్గించడానికి గ్రీన్ టీ చాలా ఉపయోగపడుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే రోజుకు రెండు కప్పులకు మించి గ్రీన్ టీని కడుపులో వేస్తే, అది చాలా సమస్యల్ని మీ గడపలోకి తీసుకొస్తుందంటున్నారు పరిశోధకులు. వాళ్లు చెబుతున్నదాని ప్రకారం… గ్రీన్ టీలోనూ కొద్దిగా కెఫీన్ ఉంటుంది. ఉండదనుకుని రోజుకు నాలుగైదు కప్పులు లాగిస్తే, శరీరంలోకి కెఫీన్ ఎక్కువగానే చేరిపోతుంది  గర్భవతులు రెండు కప్పుల కంటే ఎక్కువ గ్రీన్ టీ తాగితే… గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందట  గ్రీన్ టీలోని పాలీఫినాల్స్ మోతాదు […]Full Article

పండ్లతో ఆరోగ్యం

February 26, 2015 Posted By 0 comments
పండ్లతో ఆరోగ్యం
పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎందుకంటారా? వీటి వల్ల శరీరానికి ఎన్నో లాభాలున్నాయి. పండ్లు, కూరగాయలు తింటే ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాదు కొన్ని క్రానిక్‌ జబ్బుల మీద ఇవి టానిక్‌లా పనిచేస్తాయి. అవేమిటో తెలుసుకుందామా… పండ్లలో సహజంగానే ఫ్యాట్‌, సోడియం, కాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కొలసా్ట్రల్‌ ఉండదు. ఎన్నో అతిముఖ్యమైన న్యూట్రియంట్లు పండ్లలో ఉంటాయి. ఉదాహరణకు పొటాషియం, డైటరీ ఫైబర్‌, విటమిన్‌- సి, ఫోలిక్‌ యాసిడ్లు పండ్లలో ఎక్కువగా ఉంటాయి. పొటాషియం ఎక్కువగా ఉన్న పండ్లు, ఆహారపదార్థాలు తినడం వల్ల రక్తపోటు […]Full Article