Entertainment

లింగా స్టోరీ లైన్ నాదే…

November 13, 2014 Posted By 0 comments
లింగా స్టోరీ లైన్ నాదే…
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లింగా స్టోరీ లైన్ తనదే అంటూ రవిరత్నం అనే నిర్మాత మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. రిలీజ్ ను ఆపాలంటూ పిటిషన్ వేశారు. దీన్ని కోర్టు పరిగణలోకి తీసుకుని విచారణ చేపట్టింది. తాను నిర్మించిన ముళ్లై వనం 999 సినిమా స్టోరీ లైన్ ఇదేనంటూ ఆయన కోర్టు కెక్కారు. డిసెంబర్ 12 లింగా విడుదలకు సిద్ధమవుతుంటే.. తాజా వివాదం తెరపైకి వచ్చింది. రజినీ లింగా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న ఆయన అభిమానులకు ఇప్పుడు కోర్టు ఏం చెబుతుందోనన్న టెన్షన్ పట్టుకుంది.Full Article

టాలీవుడ్ లో నషా ఎక్కించనున్న పూనమ్..

November 12, 2014 Posted By 0 comments
టాలీవుడ్ లో నషా ఎక్కించనున్న పూనమ్..
బాలీవుడ్ లో సెక్సీస్టార్ గా యూత్ ను ఉర్రూలూగించిన స్టార్ పూనమ్ పాండే. తరచూ వార్తల్లో నిలుస్తున్న ఈ హీరోయిన్ కు అక్కడ అవకాశాలు తగ్గిపోయాయి. అయితే తెలుగులో మాత్రం ఓ బంపర్ ఆఫర్ తగిలింది. దీంతో తొలిసారిగా తెలుగు తెరపై హీట్ పెంచేందుకు పూనమ్ పాండే రెడీ అవుతోంది. వీరు.కె సారథ్యంలో నిర్మితమవుతున్న మాలినీ & కో అనే సినిమాలో లీడ్ రోల్ పోషిస్తోంది పూనమ్. మూవీ లాంఛ్ కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్ గా పూనమ్ కనిపించింది. ఇందలో పూనమ్ పాత్ర ఎలా […]Full Article

గొలుసుతో వస్తానంటున్న రాంగోపాల్ వర్మ!!

November 11, 2014 Posted By 0 comments
గొలుసుతో వస్తానంటున్న రాంగోపాల్ వర్మ!!
అండర్ వరల్డ్ కథాంశంగా రాంగోపాల్ వర్మ సరికొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. ఈ సారి గొలుసు అంటూ వస్తున్నారు. ఇప్పటికే ఐస్ క్రీమ్ 2, శ్రీదేవి, పట్టపగలు అన్న చిన్న బడ్జెట్ సినిమాలు తీస్తున్న వర్మ… ఆ లైన్లోనే గొలుసు సినిమాకు ప్లాన్ చేశారు. దర్శకుడు రమేష్ వర్మ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇంకా నటీనటులను ఎంపిక చేయలేదు. హీరోగా దగ్గుబాటి రానా కోసం ప్రయత్నించగా డేట్లు దొరకలేవని తెలిసింది. అండర్ వరల్డ్ స్టోరీలో హీరో ఎవరు సెట్ అవుతారో చూడాల్సిందే.Full Article

మహేష్ బాబు తండ్రి పాత్రలో జగపతిబాబు!

November 11, 2014 Posted By 0 comments
మహేష్ బాబు తండ్రి పాత్రలో జగపతిబాబు!
మహేష్ బాబు సరికొత్త మూవీ పుణెలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో మహేష్ కు జోడీగా శృతి హాసన్ నటిస్తోంది. మిర్చి ఫేం కొరటాల శివ దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రిన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అందుకు తగ్గట్లే ఎన్నో సరికొత్త అంశాలు కొత్త మూవీకి ప్లస్ అవుతున్నాయి. కారణం ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ వాయిస్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇస్తున్నాడు. అలాగే మహేష్ బాబు తండ్రి పాత్రలో జగపతి బాబు నటిస్తున్నారు. వచ్చే నెల నుంచి ఆయన సెట్స్ […]Full Article

బరువు భారీగా తగ్గిన మాధవన్..

November 11, 2014 Posted By 0 comments
బరువు భారీగా తగ్గిన మాధవన్..
మాధవన్ ఓ సినిమా కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. బాక్సర్ మహ్మద్ అలీ జీవితగాధ స్ఫూర్తిగా తెరకెక్కుతున్న లాల్ అనే సినిమా కోసం మాధవన్ ఏకంగా 15 కిలోల బరువు తగ్గించుకున్నాడట. మేరీ కోమ్ సినిమాతో ప్రియాంక చోప్రా బాక్సర్ పాత్రలో నటించాక.. బాలీవుడ్ లో లాల్ అదే తరహాలో తెరకెక్కుతోంది. లాస్ ఏంజిల్స్ లో ఈ సినిమా కోసం బాక్సింగ్ కిక్ ల కోసం మాధవన్ శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిసింది. బాక్సర్ బాడీలా తనను తాను మలుచుకునేందుకు రకరకాల కసరత్తులు చేస్తున్నాడు మాధవన్. మంచి […]Full Article

కత్తి సినిమా తెలుగులో ట్రిమ్మింగ్

November 10, 2014 Posted By 0 comments
కత్తి సినిమా తెలుగులో ట్రిమ్మింగ్
విజయ్, సమంతా జంటగా నటించిన తమిళ్ మూవీ కత్తి… విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. గజినీ డైరెక్టర్ మురుగదాస్ ఈ సినిమాకు దర్శకుడు. తమిళ వర్షన్ తో పాటు తెలుగు హక్కులను ప్రొడ్యూసర్ మధు దక్కించుకున్నారు. అయితే తెలుగులో విడుదల చేసేందుకు ఆయన కొంత సమయం తీసుకుంటున్నారు. తమిళంలో మూవీ 2 గంటల 46 నిమిషాలు ఉంది. ఇందులో 20 నిమిషాల పార్ట్ తీసేయాలనుకుంటున్నారట. రీరికార్డింగ్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకునే పనిలో ఉన్నారు. కత్తి కోలీవుడ్ లాగే టాలీవుడ్ లోనూ దుమ్ము రేపడం ఖాయమన్న నమ్మకంతో ఉన్నారు.Full Article

శ్రీవాస్ దర్శకత్వంలో రామ్ చరణ్

October 28, 2014 Posted By 0 comments
శ్రీవాస్ దర్శకత్వంలో రామ్ చరణ్
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తేజ్ ను శ్రీవాస్ డైరెక్ట్ చేయనున్నట్లు తెలిసింది. లౌక్యం సినిమా ఘన విజయంతో దూకుడు మీదున్న శ్రీవాస్ బంపర్ ఆఫర్ తగిలినట్లే. రచయితలు కోన వెంకట్, గోపీమోహన్ తో కలిసి కథను వినిపించినట్లు సమాచారం. శ్రీవాస్ కథతో రాంచరణ్ ఇంప్రెస్ అయినట్లు ఫిల్మ్ నగర్ టాక్. గోవిందుడు అందరివాడేలే విజయంతో కూల్ గా ఉన్న చరణ్.. తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో నటించాల్సి ఉంది. అయితే ఈ రెండింట్లో ఎవరికి ఓటేస్తాడన్నది సస్పెన్స్ గా మారింది.Full Article

ఎర్రబస్సుతో వస్తున్న దాసరి, మంచువిష్ణు

October 28, 2014 Posted By 0 comments
ఎర్రబస్సుతో వస్తున్న దాసరి, మంచువిష్ణు
తాతా, మనవళ్ల అనుబంధాన్ని ఎర్రబస్ మూవీలో అత్యద్భుతంగా చిత్రీకరించామంటున్నారు దాసరి నారాయణ రావు. ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తమిళ సినిమా మంజపాయి మూలంగా తెరకెక్కిన ఎర్రబస్ సినిమాలో భావోద్వేగాలతో పాటు తాతా మనవళ్ల సరదాలెన్నో ఉంటాయంటోంది చిత్ర యూనిట్. తాతగా దాసరి నారాయణ రావు, మనవడిగా విష్ణు నటించారు. పల్లెటూళ్లో ఉండే తాత, సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేసే మనవడు విష్ణు, మధ్యలో సెంటిమెట్లు, ఇద్దరి అనుబంధం.. ఈ తరహా ఇతివృత్తంతో తెరకెక్కింది. కచ్చితంగా ఫ్యామిలీ […]Full Article

టాలీవుడ్ దేశంలోనే నెంబర్ వన్

October 28, 2014 Posted By 0 comments
టాలీవుడ్ దేశంలోనే నెంబర్ వన్
దేశంలో సినిమాల నిర్మాణంలో టాలీవుడ్ తొలి స్థానంలో నిలిచింది. బాలీవుడ్, కోలీవుడ్ లను బీట్ చేసి ఫస్ట్ ప్లేస్ సాధించింది. విషయం ఏంటంటే ఏప్రిల్ 2013 నుంచి మార్చి 2014 వరకూ దేశవ్యాప్తంగా మొత్తం 1966 సినిమాలు విడుదలయ్యాయి. అందులో 349 సినిమాలతో టాలీవుడ్ తొలి స్థానంలో నిలవగా, 326 మూవీలతో తమిళ్ ఇండస్ట్రీ రెండోస్థానంలో నిలిచింది. ఇక 263 సినిమాలతో బాలీవుడ్ మూడో పొజిషన్ లో ఉంది. సినిమాలు ఎన్ని విడుదలైనా ఎక్కువ సక్సెస్ రేటు మాత్రం కోలీవుడ్ లో ఉంది.Full Article