Articles by: News desk

లౌకికవాద పదం పెద్ద అబద్ధం. యూపి సిఎం ఆదిత్యనాథ్

November 14, 2017 Posted By 0 comments
లౌకికవాద పదం పెద్ద అబద్ధం. యూపి సిఎం ఆదిత్యనాథ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లౌకికవాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్‌‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మతతత్త్వం, లౌకకవాదం గురించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ‘లౌకికవాదం’ అనే పదం పెద్ద అబద్ధమని చెప్పారు. చరిత్రను వక్రీకరించడమంటే దేశ ద్రోహంతో సమానమని తెలిపారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పెద్ద అబద్ధం ఏమిటంటే ‘లౌకికవాదం’ అనే పదమేనని యోగి అన్నారు. ఈ పదాన్ని రూపొందించినవాళ్ళు, దాన్ని ఉపయోగించినవాళ్ళు క్షమాపణ చెప్పాలన్నారు. ఏ వ్యవస్థా లౌకికవాదంగలది కాదన్నారు. […]Full Article

కృష్ణానదిలో పడవ ప్రమాదం: 19 మంది మృతి

November 13, 2017 Posted By 0 comments
కృష్ణానదిలో పడవ ప్రమాదం: 19 మంది మృతి
కృష్ణా నదిలో ఆదివారం సాయంత్రం పడవ బోల్తా పడడంతో 19 మంది మృతి చెందారు. విజయవాడలోని పున్నమిఘాట్‌ నుంచి ఇబ్రహీంపట్నం సంగమం వద్దకు వెళుతుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కొందరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మరికొందరిని స్థానికులు, గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రక్షించాయి. మృతుల్లో ఎక్కువ మంది ఒంగోలుకు చెందిన వారు. గల్లంతు అయినవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి మృతదేహాలకు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించి, అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. […]Full Article

అరుణాచల్ భారత్ లో అంతర్భాగం చైనాకు స్పష్టంచేసిన ప్రభుత్వం

November 10, 2017 Posted By 0 comments
అరుణాచల్ భారత్ లో అంతర్భాగం చైనాకు స్పష్టంచేసిన ప్రభుత్వం
రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించడంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో భారత ప్రభుత్వం గట్టిగా స్పందించింది. భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్ అంతర్భాగమని చైనాకు తెగేసి చెప్పింది. భారతీయ నేతలు ఆ రాష్ట్రంలో పర్యటించేందుకు సంపూర్ణ స్వేచ్ఛ ఉందని స్పష్టం చేసింది. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి రవీష్ కుమార్ మాట్లాడుతూ అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగమని, భారతదేశ నేతలు దేశంలోని మిగతా ప్రాంతాల్లో పర్యటించేందుకు ఎటువంటి స్వేచ్ఛ ఉందో, అదే స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు అరుణాచల్ ప్రదేశ్‌లో […]Full Article

తమిళనాడు: శశికళ బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు

November 9, 2017 Posted By 0 comments
తమిళనాడు: శశికళ బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు
అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ బంధువుల ఆస్తుల లక్ష్యంగా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. గురువారం తెల్లవారుజాము నుంచి 80మందికిపైగా ఐటీ అధికారులు ఏకంగా 30 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. జయలలిత ప్రారంభించిన జయ టీవీ, అన్నాడీఎంకేకు చెందిన నమధు ఎంజీఆర్‌ పత్రిక కార్యాలయాల్లోనూ ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. జయటీవీ కార్యాలయంలో దాదాపు పదిమంది ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ పత్రిక, టీవీలు శశికళ కుటుంబసభ్యుల  అధీనంలో ఉన్నాయి. పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జయటీవీ, ఎంజీఆర్‌ పత్రిక పనిచేస్తున్న నేపథ్యంలోనే […]Full Article

ఎస్సీ వర్గీకరణ: ఎమ్మార్పీఎస్‌ కలెక్టరేట్ల ముట్టడిలో మహిళా కార్యకర్త మృతి

November 7, 2017 Posted By 0 comments
ఎస్సీ వర్గీకరణ: ఎమ్మార్పీఎస్‌ కలెక్టరేట్ల ముట్టడిలో మహిళా కార్యకర్త మృతి
ఎస్సీ వర్గీకరణ కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలనే డిమాండ్‌తో ఎమ్మార్పీఎస్‌ చేపట్టిన కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమం విషాదానికి దారితీసింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం కలెక్టరేట్ల ముట్టడిలోభాగంగా ఆబిడ్స్ లోని హైదరాబాద్‌ కలెక్టరేట్‌ ముట్టడికి ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు యత్నించారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో సికింద్రాబాద్‌ వెస్ట్ మారేడుపల్లి కంటోన్మెంట్‌లోని గాంధీ హట్స్‌ ప్రాంతానికి చెందిన భారతి (45) అనే కార్యకర్త కిందపడిపోయారు. దీనిని గమనించిన ఇతర కార్యకర్తలు, పోలీసులు ఆమెకు ఫిట్స్‌ వచ్చిందని భావించి ప్రాథమిక […]Full Article

ప్యారడైజ్‌ పేపర్ల సంచలనం. ప్రముఖుల ఆర్థిక లావాదేవీలు బట్టబయలు

November 6, 2017 Posted By 0 comments
ప్యారడైజ్‌ పేపర్ల సంచలనం. ప్రముఖుల ఆర్థిక లావాదేవీలు బట్టబయలు
ప్యారడైజ్‌ పేపర్ల పేరుతో ప్రపంచంలోని ప్రముఖుల ఆర్థిక లావాదేవీలు బహిర్గతమయ్యాయి. ఇందుకు సంబంధించి 13.40 లక్షల పత్రాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఇంటర్నేషనల్‌ కన్సోర్టియమ్‌ ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌(ఐసీఐజే) ఇందుకు సంబంధించిన ప్యారడైజ్‌ పేపర్లను లీక్‌ చేసింది. అమెరికా వాణిజ్య శాఖ కార్యదర్శి విల్‌బర్‌ రాస్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సన్నిహితులకు చెందిన షిప్పింగ్‌ కంపెనీతో ఉన్న వ్యాపార సంబంధాలు బట్టబయలయ్యాయి. బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 2తో పాటు కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రుడూ సీనియర్‌ సలహాదారు స్టీఫెన్‌ బ్రౌన్ఫ్‌మన్‌ల పేర్లు కూడా […]Full Article

మోదీకి మెజారిటీవస్తే ఆర్టికల్‌ 370ని సమూలంగా మార్చే అవకాశం. సియం మెహబూబా ముఫ్తీ

November 4, 2017 Posted By 0 comments
మోదీకి మెజారిటీవస్తే ఆర్టికల్‌ 370ని సమూలంగా మార్చే అవకాశం. సియం మెహబూబా ముఫ్తీ
ఆర్టికల్‌ 370పై జమ్మూ కశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కలిగించే ఆర్టికల్‌ 370ని కొనసాగించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం జమ్మూ కశ్మీర్‌ ప్రజలకు కల్పించిన ప్రత్యేక గౌరవమని దీనిని భారత ప్రభుత్వం కొనసాగించాలని ఆమె చెప్పారు. చర్చలు, పరస్పర విరుద్ధ భావాలే ప్రజాస్వామ్యానికి ఆయుపుపట్టు అని ఆమె తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీకి 2019 ఎన్నికల్లో అనూహ్యమైన, ఆశ్చర్యకర మెజారిటీ లభిస్తే జమ్మూకశ్మీర్‌ చరిత్రను, ఆర్టికల్‌ 370ని సమూలంగా మార్చే అవకాశముందని […]Full Article

మసూద్‌ అంతర్జాతీయ ఉగ్రవాది కాదు, భారత్ తో కలసి పనిచేస్తాం. చైనా

November 3, 2017 Posted By 0 comments
మసూద్‌ అంతర్జాతీయ ఉగ్రవాది కాదు, భారత్ తో కలసి పనిచేస్తాం. చైనా
పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్‌ నాయకుడు, పఠాన్‌కోట్‌ దాడి సూత్రధారి మసూద్‌ అజహార్‌పై ‘అంతర్జాతీయ ఉగ్రవాది’ ముద్ర పడకుండా చైనా గురువారం మరోసారి అడ్డుకుంది. శుక్రవారం భారత్‌తో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చైనా ప్రకటన చేసింది. భారత్‌లో సత్సంబంధాలకు చైనా కీలక ప్రాధాన్యం ఇస్తుందని ఆ దేశ విదేశాంగ సహాయ మంత్రి చెన్‌ జియోడాంగ్‌ అన్నారు. ఈ విషయంపై శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన చైనాకు భారత్‌ ముఖ్యమైన పొరుగుదేశం. ఈ నవశకంలో చైనా తన ప్రమాణాలతో పొరుగుదేశాల దౌత్యసంబంధాలను పెంపొందించుకోవాలని […]Full Article

అమెరికా: కొలరాడో వాల్‌మార్ట్‌ స్టోర్‌లో కాల్పులు ఇద్దరు మృతి

November 2, 2017 Posted By 0 comments
అమెరికా: కొలరాడో వాల్‌మార్ట్‌ స్టోర్‌లో కాల్పులు ఇద్దరు మృతి
అమెరికాలోని కొలరాడో ప్రాంతంలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. స్థానిక వాల్‌మార్ట్‌ స్టోర్‌లో బుధవారం రాత్రి  ఓ దుండగుడు చొరబడి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. దుండగుడు స్టోర్‌లోకి చొరబడి 30 రౌండ్లు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బుధవారం న్యూయార్క్‌ నగరంలో ఓ దుండగుడు ట్రక్కుతో బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతిచెందారు. ఈ […]Full Article

అమెరికా: న్యూయార్క్‌ లో ట్రక్ తో ఉగ్రదాడి, 8మంది మృతి

November 1, 2017 Posted By 0 comments
అమెరికా: న్యూయార్క్‌ లో ట్రక్ తో ఉగ్రదాడి, 8మంది మృతి
అమెరికాలోని న్యూయార్క్‌ రాష్ట్రంలోని మ్యాన్‌హట్టన్‌లో బుధవారం తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) ఉగ్రవాది ట్రక్కుతో దాడి చేసాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా 15 మందికి గాయాలయ్యాయి. వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ మెమోరియల్‌ దగ్గరలో సైకిళ్లు, పాదాచారులు వెళ్లే పాత్‌పైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఆ తర్వాత ఆగి ఉన్న స్కూల్‌ బస్సును కూడా ట్రక్కుతో ఢీ కొట్టి పారిపోతున్న దుండగుడిని అమెరికన్‌ పోలీసులు తుపాకీతో కాల్చారు. పొత్తికడుపులో బుల్లెట్‌ తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ట్రక్కు నుంచి దిగి […]Full Article