Articles by: News desk

ఇజ్రాయెల్‌ రాజధానిగా జెరూసలేం. అమెరికా నిర్ణయాన్ని వ్యతిరేకించిన పలుఅరబ్ దేశాలు

December 7, 2017 Posted By 0 comments
ఇజ్రాయెల్‌ రాజధానిగా జెరూసలేం. అమెరికా నిర్ణయాన్ని వ్యతిరేకించిన పలుఅరబ్ దేశాలు
ఇజ్రాయెల్‌ రాజధానిగా ప్రస్తుత టెల్‌ అవీవ్‌ స్థానంలో జెరూసలేంను గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. టెల్‌ అవీవ్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయాన్ని జెరూసలేంకు తరలించే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాల్సిందిగా అమెరికా విదేశాంగ శాఖను ట్రంప్‌ ఆదేశించారు. ‘జెరూసలేంను ఇజ్రాయెల్‌ రాజధానిగా అధికారికంగా గుర్తించేందుకు ఇదే సమయమని నేను నిర్ణయించాను’ అని ట్రంప్‌ అన్నారు. ఈ పనిని అమెరికా ఎప్పుడో చేసి ఉండాల్సిందని ఆయన పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ అంశంలో ఏదైనా చేయాలని గత అధ్యక్షులు చెప్పేవారు. కానీ వారు […]Full Article

ఆంధ్రప్రదేశ్‌: డిశెంబర్ 15న డీఎస్సీ నోటిఫికేషన్‌, మంత్రి గంటా

December 6, 2017 Posted By 0 comments
ఆంధ్రప్రదేశ్‌: డిశెంబర్ 15న డీఎస్సీ నోటిఫికేషన్‌, మంత్రి గంటా
ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ వివరాలను మానవవనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం ప్రకటించారు. ఈ నెల 15న సిలబస్‌, నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని చెప్పారు. మొత్తం 12,370 పోస్టులకు డిసెంబర్‌ 26 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. 45 రోజుల పాటు అప్లికేషన్‌కు గడువు ఉంటుందని వెల్లడించారు. మార్చి 23, 24, 26 తేదీల్లో పరీక్షలు జరుగుతాయని చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరానికి ఉపాధ్యాయులు అందుబాటులో ఉండేలా జూన్‌ 12 కల్లా భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. 1998, 2008, 2012 డిఎస్సీ అభ్యర్థుల […]Full Article

50శాతానికి మించి రిజర్వేషన్ల హామీ ప్రజలను పక్కదోవ పట్టించడమే. ప్రధానిమోదీ

December 5, 2017 Posted By 0 comments
50శాతానికి మించి రిజర్వేషన్ల హామీ ప్రజలను పక్కదోవ పట్టించడమే. ప్రధానిమోదీ
యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఇస్తామని ఎవరైనా చెబితే అది తప్పుడు హామీయే అవుతుందని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ సుప్రీంకోర్టు విధించిన యాభై శాతం పరిమితిని దాటి గుజరాత్‌లో పటేల్‌ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తామని తప్పుడు హామీలిస్తోందని ప్రధాని మోదీ మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు హామీలు ఇవ్వాల్సి వచ్చినపుడు ఆ పార్టీ కపిల్‌ సిబల్‌ వంటి నేతలను రంగంలోకి దించుతుందని అన్నారు. హార్ధిక్‌ పటేల్‌ నేతృత్వంలోని పాటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి(పాస్)తో కాంగ్రెస్‌ ముఖ్యనేత కపిల్‌ సిబల్‌ ఒక రహస్య […]Full Article

లోక్‌పాల్‌ చట్టాన్ని నీరుగార్చిన మోదీ ప్రభుత్వం. అన్నాహజారే

December 4, 2017 Posted By 0 comments
లోక్‌పాల్‌ చట్టాన్ని నీరుగార్చిన మోదీ ప్రభుత్వం. అన్నాహజారే
నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం అవినీతి నిరోధక లోక్‌పాల్‌ చట్టాన్ని నీరుగార్చిందని సామాజిక కార్యకర్త అన్నాహజారే ఆరోపించారు. అరుదుగా మాట్లాడే మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తన హయాంలో లోక్‌పాల్‌ చట్టాన్ని బలహీనంగా రూపొందించారు. ప్రస్తుత ప్రధాని మోదీ దాన్ని మరింత నిర్వీర్యం చేశారని అన్నారు. ప్రభుత్వ అధికారుల భార్య, కుమారుడు, కుమార్తె ఏటా తమ ఆస్తుల వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని 2016 జులైలో చట్టానికి సవరణలు చేశారని గుర్తుచేశారు. చట్ట ప్రకారం అధికారుల కుటుంబ సభ్యులు తమ ఆస్తులను ఏటా వెల్లడించాలనే […]Full Article

బీసీ కమిషన్‌ నివేదిక ఇంకా ఇవ్వలేదు. చైర్మన్‌ జస్టిస్ మంజునాథ్‌

December 2, 2017 Posted By 0 comments
బీసీ కమిషన్‌ నివేదిక ఇంకా ఇవ్వలేదు. చైర్మన్‌ జస్టిస్ మంజునాథ్‌
కాపులను బీసీల్లో చేర్చడంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంజునాథ కమిషన్‌ నివేదికపై ఏపీ బీసీ కమిషన్‌ చైర్మన్‌ మంజునాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.  తాను ఇచ్చే నివేదికే కమిటీ నివేదిక అని, కమిషన్‌ నివేదిక సెప్టెంబరులోనే పూర్తయిందని ఈ నివేదిక ఏపీలో అన్ని వర్గాల వారికి ఆమోదయోగ్యంగా ఉంటుందని అన్నారు. కమిషన్‌ నివేదికను ఒకట్రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. ఆ నివేదిక ఇవ్వడానికి తాను వెళ్లడం లేదని, కమిషన్‌ కార్యదర్శి కృష్ణమోహన్‌ వెళతారన్నారు. కమిషన్‌లోని మిగిలిన ముగ్గురు సభ్యులు వ్యక్తిగతంగా […]Full Article

పోలవరం ప్రాజెక్టు ఆపివేయాల్సిందే అని చెబితే కేంద్రానికే అప్పగిస్తాం. ఏపి సియం చంద్రబాబు

December 1, 2017 Posted By 0 comments
పోలవరం ప్రాజెక్టు ఆపివేయాల్సిందే అని చెబితే కేంద్రానికే అప్పగిస్తాం. ఏపి సియం చంద్రబాబు
పోలవరం స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ టెండర్ల ప్రక్రియ ఆపాలంటూ కేంద్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి అమర్జిత్‌సింగ్‌ లేఖ రాయడంపై అసెంబ్లీలో, సభ బయట చంద్రబాబు స్పందించారు. మొత్తం పరిస్థితిని కేంద్రానికి వివరిస్తాం. అయిప్పటికీ ఆపివేయాల్సిందే అని చెబితే అలాగే చేసి, ప్రాజెక్టును కేంద్రానికే అప్పగిస్తాం. పోలవరం ప్రాజెక్టు పూర్తికి సాయం చేయాలని పదేపదే అడుగుతున్నాం. సాయం చేయలేమని వారు చెప్పారనుకోండి ఏం చేస్తాం! నమస్కారం పెట్టి తప్పుకొంటాం! అని తేల్చిచెప్పారు. అయితే, తాను ఆశావాదినని, చివరి నిమిషం వరకూ తన ప్రయత్నం తాను […]Full Article

ఉత్తర కొరియా యుద్ధానికి దగ్గరగా వస్తోంది. యూఎస్ రాయబారి నిక్కీ హేలీ

November 30, 2017 Posted By 0 comments
ఉత్తర కొరియా యుద్ధానికి దగ్గరగా వస్తోంది. యూఎస్ రాయబారి నిక్కీ హేలీ
క్షిపణి ప్రయోగాలతో ఉత్తర కొరియా యుద్ధానికి రెచ్చగొడుతోందని, అదే జరిగితే ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తామని అమెరికా హెచ్చరించింది. క్షిపణి ప్రయోగంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో యూఎన్‌లో అమెరికా రాయబారి నిక్కీ హేలీ మాట్లాడుతూ ప్యాంగ్యాంగ్‌కు ఘాటు హెచ్చరికలు చేశారు. ‘యుద్ధం వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదు. ఉత్తరకొరియాను సర్వనాశనం చేస్తాం. ఉ.కొరియా నియంత యుద్ధాన్నే ఎంచుకుంటున్నారు. మాకు ఇప్పటికీ యుద్ధం చేయాలనే ఆలోచన లేదు. కానీ, ఆ దేశం యుద్ధానికి దగ్గరగా వస్తోంది’ […]Full Article

ట్రంప్‌ హెచ్చరికలు పెడచెవినపెడుతున్న పాక్. యూఎస్‌ ఆర్మీ జనరల్‌ జాన్‌ నికోల్సన్‌

November 29, 2017 Posted By 0 comments
ట్రంప్‌ హెచ్చరికలు పెడచెవినపెడుతున్న పాక్. యూఎస్‌ ఆర్మీ జనరల్‌ జాన్‌ నికోల్సన్‌
పాకిస్థాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా ఆ దేశ వైఖరిలో మార్పు రావడం లేదని యూఎస్‌ ఆర్మీ జనరల్‌ జాన్‌ నికోల్సన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉగ్రవాదులను నియంత్రించకపోతే పాక్‌పై కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని గతంలో ట్రంప్‌ పలుమార్లు హెచ్చరించారు. వాటిని పాక్‌ పెడచెవిన పెట్టినట్లు కనిపిస్తోంది. పాక్‌ ప్రవర్తన తీరులో ఎటువంటి మార్పులు రాలేదన్నారు. హక్కానీ నెట్‌వర్క్‌, మిలిటెంట్‌ గ్రూపులకు పాక్‌ స్వర్గధామంగా మారింది. కిడ్నాప్‌కు గురైన అమెరికా-కెనడా జంటను ఆఫ్ఘనిస్థాన్‌లోని ఉగ్రవాదుల నుంచి రక్షించేందుకు పాక్‌ […]Full Article

పురుషాధిక్య సమాజంలో మహిళలు రాణించడం గొప్ప విషయం. ఇవాంక ట్రంప్‌

November 28, 2017 Posted By 0 comments
పురుషాధిక్య సమాజంలో మహిళలు రాణించడం గొప్ప విషయం. ఇవాంక ట్రంప్‌
  హైదరాబాద్‌లో గ్లోబల్‌ ఎంట్రప్రెన్యూర్‌ సదస్సు(జీఈఎస్‌)లో పాల్గొనడం సంతోషకరమని ఇవాంక ట్రంప్‌ అన్నారు. హైదరాబాద్ ఇన్నోవేషన్‌ హబ్‌గా ఎదుగుతుందన్నారు. అమెరికాకు భారత్‌ అసలైన మిత్ర దేశమని, ఎంతో చరిత్ర, ప్రాశస్త్యం ఉన్నాయని అన్నారు. ముత్యాల నగరంలో యువతే గొప్ప సంపదని, ఇక్కడి పారిశ్రామికవేత్తలు సరికొత్త విప్లవం సృష్టిస్తున్నారని కొనియాడారు. మీరంతా రాత్రింబవళ్లు కష్టపడి రోబోలు, యాప్‌లు రూపొందిస్తున్నారని ఇవాంక ప్రశంసించారు. భారతీయ నిపుణులు తమకు స్ఫూర్తిదాయకమని, టీ అమ్మే స్ధాయి నుంచి ప్రధాని కాగలడం మీ ప్రధాని గొప్పతనమని ఆమె ప్రస్తుతించారు. ఆసియాలోనే అతిపెద్ద […]Full Article

మధ్యప్రదేశ్‌: బాలికలపై అత్యాచారాలకు పాల్పడితే మరణశిక్ష

November 27, 2017 Posted By 0 comments
మధ్యప్రదేశ్‌: బాలికలపై అత్యాచారాలకు పాల్పడితే మరణశిక్ష
మధ్యప్రదేశ్‌లో మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపులను అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన నిర్ణయానికి ఉపక్రమించింది. 12 ఏళ్ల కంటే తక్కువ వయసున్న బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితులకు మరణ శిక్ష విధించాలన్న తీర్మానానికి ఆ రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.మహిళలపై సామూహిక అత్యాచారం చేసే నిందితులకు కూడా మరణ శిక్ష విధించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అత్యాచారం రుజువైన పక్షంలో నిందితులకు విధించే శిక్ష, జరిమానా మొత్తాన్ని పెంచేందుకు సైతం శిక్షా స్మృతిని సవరించేందుకు సైతం అంగీకారం తెలిపింది. మహిళలపై అత్యాచారయత్నం చేసినా, వెంటపడి […]Full Article